Ration Rice | సిర్గాపూర్, మే 20 : గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని సిర్గాపూర్ ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి మండలంలోని పోచాపూర్ చౌరస్తా వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా లారీ నెంబర్ కేఏ56 7022 అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశామన్నారు. దాంట్లో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులకు తెలిపామన్నారు.
అధికారులు లారీ తనిఖీ చేయగా దాంట్లో 40 టన్నుల పీడీఎస్ రైస్ ఉన్నట్లు గుర్తించి పంచనామా జరిపారని పేర్కొన్నారు. ఈ లారీ కర్ణాటకలోని గురుమిటికల్ నుంచి పిట్లం వైపు వెళుతున్నట్లు వెల్లడించారు. సివిల్ సప్లై డీటీ సజీవుద్ధీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ ఓనర్ జాకీర్మియా, డ్రైవర్ అనిల్‌కుమార్‌పై కేసు నమోదుచేసినట్లు వివరించారు. ఇందులో డీఎస్పీ విజిలెన్స్ వెంకటేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
Karimnagar | బొమ్మనపల్లిలో అగ్ని ప్రమాదం.. రూ. 2 లక్షలకు పైగా నష్టం..
Landslides | కైలాస్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన వందలాది మంది యాత్రికులు
Warangal fort | కోటను సందర్శించిన రాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ