Fish Ponds | అనుమతులు లేకుండా సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండలంలో వందల ఎకరాల్లో చేపల చెరువుల అక్రమ దందాలు యధేచ్చగా కొనసాగుతున్నాయి. మండల పరిధిలోని ఖాదిరబాద్, నిర్జప్ల, ఉసిరిక పల్లి, దరఖాస్తుపల్లి, పాలడుగు, దేవునూర్, బూతుకూరు గ్రామాల్లోని మంజీరా పరివాహక ప్రాంతంలో అక్రమంగా పట్టా, ప్రభుత్వ భూములలో చేపల చెరువులు ఏర్పాటు చేసుకున్నారు. చేపల చెరువులకు ఎలాంటి అనుమతులు లేకుండా.. విద్యుత్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండానే అధికార పార్టీ నాయకుల అండదండలతో వందల ఎకరాలు చేపల చెరువులు ఏర్పాటు చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు.
అక్రమంగా వందల ఎకరాల్లో చేపల చెరువులు ఏర్పాటు చేసినా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై పలు గ్రామాల్లో ప్రజలు మండిపడుతున్నారు. అధికారులకు ముడుపులందటంతోనే చేపల చెరువులపై చర్యలు తీసుకోవడం లేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చేపల చెరువులో చేపల పెంపకానికి బాయిలర్ కోళ్ల వ్యర్థాలు వినియోగిస్తున్నారు. బాయిలర్ కోళ్ల వ్యర్ధాలతో పెంచే చేపలు ఎంతో ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మంజీరా నదిలోకి వదిలేయడంతో నీరు కలుషితం..
చట్ట విరుద్ధంగా చేపల పెంపకం చేస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ప్రాణహిత నదిగా పేరు గాంచిన మంజీరా నది పక్కన చేపల చెరువు ఏర్పాటు చేసి చెరువులో నుంచి నీటిని పంపుల ద్వారా తీసి చేపల చెరువులకు వేయడమే కాకుండా తిరిగి మంజీరా నదిలోకి వదిలేయడంతో నీరు కలుషితం అవుతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
చేపల చెరువులు అధికంగా ఏర్పాటు చేయడంతో గొర్ల కాపరులు, పశుకాపరులకు స్థలం లేక గొర్రెలు, ఆవులను అమ్ముకొని కూలిపనులకు వెళుతున్నారు. ఉపాధి కోల్పోయామని చెప్పకుండా ఉంటే అధికార పార్టీ నాయకుల అవడంతో ఏమి చేయాలో దిక్కులేని స్థితిలో గ్రామస్తులు మనసు చంపుకుని కూలి పనులు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ చాపల చెరువులపై ఉక్కు పాదం మొపి కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజానీకం కోరుకుంటున్నారు.
F-35 fighter jet | ఇంకా కేరళలోనే F-35 ఫైటర్ జెట్.. ఎందుకంటే..!
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Robert Vadra | ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టిన రాబర్ట్ వాద్రా