Hostel wall | మునిపల్లి, సెప్టెంబర్ 9 : గత వారం రోజుల క్రితం భారీగా కురిసిన వర్షాలకు పూర్తిగా తడిసి శిథిలావస్థకు చేరినా లింగంపల్లి గురుకుల పాఠశాల హాస్టల్ భవనం గోడ హఠాత్తుగా కూలింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల హాస్టల్లో చోటుచేసుకుంది. విద్యార్థులు మధ్యాహ్నం భోజనం సమయంలో గదిలో నుండి వంటశాలకు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
హాస్టల్ శిథిలావస్థలో ఉన్నప్పటికీ చదువే ప్రాణంగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చదివే లక్ష్యంగా ఉంటున్నారు విద్యార్థులు. ఒకే గదిలో 70 మంది విద్యార్థులుంటుండగా.. కూలిన సమయంలో ఎవ్వరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.
1985లో లింగంపల్లి గురుకుల పాఠశాల హాస్టల్ భవనం నిర్మాణం చేపట్టారు. గురుకుల పాఠశాలకు సంబందించిన గదులన్నీ ప్రమాదకరంగా ఉన్నట్టు పేర్కొన్న విద్యార్థుల తల్లిదండ్రులు.. సంబంధిత అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. హాస్టల్లో సమస్యలు ఉన్నాయని పలుమార్లు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏ జిల్లా అధికారులు స్పందించలేదని జిల్లా ఉన్నతాధికారులపై విద్యార్థులు తల్లిదండ్రులు పలు రకాల విమర్శలు చేస్తున్నారు.
హాస్టల్ సమస్యలు పరిష్కరించి హాస్టల్లో నూతన అదనపు గదులు నిర్మించాలంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. లింగంపల్లి హాస్టల్లోని సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్, సంగారెడ్డి జిల్లా డీఈవో తదితర ఉన్నత అధికారులు పరిశీలించారు.
Nepal | ఆగని ఆందోళనలు.. ఓలి రాజీనామాకు డిమాండ్.. మాజీ ప్రధాని ఇంటిని ధ్వంసం చేసిన నిరసనకారులు
BRS | రైతులకు సరిపడా యూరియా అందించండి.. కాల్వశ్రీరాంపూర్లో బీఆర్ఎస్ రాస్తారోకో
Aishwarya Rai | AIతో అశ్లీల కంటెంట్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్య రాయ్