ఝరాసంగం, మే 8 : ఝరాసంగం మండలంలోని బర్దీపూర్ గ్రామంలోని దత్తగిరి ఆశ్రమంలోని శనైశ్వర జయంతి ఉత్సవాలకు రావాలంటూ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్రావుకు అశ్రమ పీఠాధిపతి సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ అహ్వాన పత్రాన్ని అందజేశారు. గురువారం హైదరాబాద్లో హారీశ్రావును కలిశారు.
ఈ నెల 27వ తేదీన స్థానిక ఆశ్రమంలోని శనైశ్వర స్వామి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, తప్పకుండా హాజరుకావాలని ఆహ్వాన పత్రాన్ని పీఠాధిపతి సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ కర్పొరేషన్ చైర్మన్ బిక్షపతి తదితరులు ఉన్నారు.