School Buildings | నిజాంపేట్, జూన్ 9 : నిజాంపేట్ మండల పరిధిలోని కొత్తపల్లి, దామరచెరువు, రామిరెడ్డిపేట్ సహా పలు తండాలలో విద్యా బోధన అందించే పాఠశాలలోనే గ్రామ పంచాయతీ విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు గదుల కొరత ఉన్నా తప్పని పరిస్థితులలో గ్రామపంచాయతీ భవనాలు లేక కొన్నిచోట్ల భవనాలు నిర్మించినప్పటికీ ప్రారంభానికి నోచుకోలేకపోతున్నాయని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందులో భాగంగా పలు చోట్ల విద్యార్థులకు సరిపడా భవనాలు లేక సరైన వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరికొన్ని చోట్ల అదనపు గదులు నిర్మాణాలు మధ్యంతరంలోనే నిలిచిపోయాయి. వీటిపై అధికారులు ఇప్పటివరకు దృష్టి సారించక అలాగే ఉండిపోయాయన్నారు.
ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభం కాకముందే గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించిన గ్రామాలలో వాటిని విధుల్లోకి తీసుకున్నట్లయితే పాఠశాల విద్యార్థులకు గదుల కొరత కొంత తగ్గించేందుకు దోహదపడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Gudem Mahipal Reddy | అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: పటాన్చెరు ఎమ్మెల్యే
Naresh | ఏడుపాయల వన దుర్గమ్మ సేవలో నరేష్..