పటాన్చెరు, ఏప్రిల్ 17 : మంచి నేతలు జనం గుండెల్లో ఉంటారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో దివంగత టీఆర్ఎస్ పార్టీ నాయకులు గోపిరెడ్డి జైపాల్‌రెడ్డి జ్ఞాపకార్ధం ఆయన కుటుంబ సభ్యులు జీజేఆర్ సాయి త్రిశూల్ సేవా సమితి ద్వారా అందజేసిన మంచినీటి ట్యాంకర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.జైపాల్‌రెడ్డి పేరున ఉచిత మంచినీటిని అందజేసే కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇస్నాపూర్ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి పట్టు ఉందన్నారు. ఏ కార్యక్రమం చేసినా జైపాల్‌రెడ్డి ముందుండి కార్యక్రమం విజయవంతం చేసేవారని కొనియాడారు. సామన్య ప్రజలు ఏ సమస్యతో వెళ్లినా తక్షణ స్పందించి వాటిని పరిష్కరించేవాడన్నారు. ప్రజల మనిషిగా జైపాల్‌రెడ్డి ఉండేవాడని పేర్కొన్నారు. పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జైపాల్‌రెడ్డి కుటుంబానికి పార్టీ తరపునను తాను కూడా అండగా నిలుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.