Girls | ఝరాసంగం, అక్టోబర్ 15: ఆడపిల్లలు చట్టాలపై అవగాహన కలిగి అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డియల్యస్ఏ) సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బి. సౌజన్య పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికాల విద్యాలయంలో జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ, మహిళా సాధికారత కేంద్రం సంయుక్తంగా భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అంతర్జాతీయ బాలిక దినోత్సవ కార్యక్రమానికి జడ్జి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. పిల్లల సంరక్షణ చట్టం, బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం వంటి నిబంధనలు బాలికల రక్షణకు బలమైన ఆయుధాలుగా నిలుస్తున్నాయని అన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తు లక్ష్యాలను నిర్ణయించుకొని క్రమశిక్షణతో కృషి చేస్తే తప్పక విజయాన్ని సాధిస్తారని ప్రేరేపించారు. బాలికల విద్య అంటే ఒక అమ్మాయి మాత్రమే కాదు ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని వెలిగించే శక్తి అని సూచించారు.
ఈ సంవత్సరం థీమ్ ప్రకారం బాలికల హక్కులపై పెట్టుబడి పెట్టడమంటే భవిష్యత్తు సమాజంపై పెట్టుబడి పెట్టినట్టే అని పేర్కొన్నారు. అనంతరం ఆడపిల్లల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మొక్కలు నాటడంతో పాటు నషా ముక్త భారత్ అభియాన్ పోస్టర్లను విడుదల చేసి ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.
అంతకుముందు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ, మండల ప్రత్యేకాధికారిణి లలితకుమారి, సీడీపీవో అంజమ్మ, ఎస్ఐ క్రాంతికుమార్ పాటిల్, మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి, ఐసిడిఎస్ పర్యవేక్షకులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.
Read Also :
OG | థియేటర్లలో ‘ఓజీ’ ఘన విజయం ..ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌పై స్పెషల్ ఫోకస్..!
Ed Sheeran | ఇంటర్నేషనల్ కోలాబరేషన్.. బ్రిటీష్ పాప్ సింగర్‌తో సంతోష్ నారాయణన్ ఇండియన్ ఆల్బమ్
Tanuj Mouli | రూ. కోటి అడ్వాన్స్.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్.