నిజాంపేట్, మే11 : కార్యకర్తలను నిరంతరం కంటికిరెప్పలా కాపాడుకోవడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భుపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం నిజాంపేట్ గ్రామానికి చెందిన సాయమ్మకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 18000 వేల రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేసారు. ఆయన వెంట మాజీ జడ్పిటిసి నర్సింమరెడ్డి, మండల సర్పంచ్ల పోరం మాజీ అద్యక్షుడు జగదీశ్వర చారి, రాంచందర్ రావు పాటిల్, శ్రీనివాస్‌గౌడ్, లింగాగౌడ్, గడ్డమీది సాయగౌడ్, కృష్ణ, అంబదాస్గౌడ్, హనుమగౌడ్, తదితరులు ఉన్నారు.
అలాగే మండలంలోని నాగదార్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రకుంట తండాకు చెందిన గమినిబాయి నారాయణఖేడ్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న భుపాల్‌రెడ్డి హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని అధైర్యపడొద్దు అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో మాజీ జడ్పిటిసిలు లక్ష్మీబాయి, రవీందర్ నాయక్, నర్సింహరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు నగేష్ , దస్తగిరి తదితరులు ఉన్నారు.