జహీరాబాద్, జనవరి 16 : రోడ్డు ప్రమాదాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ అన్నారు. శుక్రవారం జహీరాబాద్ పట్టణం, న్యాల్ కల్ మండలంలోని మిర్జాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సంబంధిత అధికారులు సిబ్బందికి రోడ్డు భద్రతా వారోత్సవాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ వినియోగం, సీట్బెల్డ్ ప్రాధాన్యత, ఫస్ట్ ఎయిడ్ వినియోగం, డిఫెన్సివ్ డ్రైవింగ్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
రోడ్డు, ట్రాఫిక్ నిబంధ నలు తప్పకుండా పాటించినప్పుడే ప్రమాదాలు జరగవని అన్నారు. జహీరాబాద్ పట్టణ సిఐ శివలింగం మాట్లాడుతూ రోడ్డుప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు సహకరించాలన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్ , తాసిల్దార్ దశరథ్, రూరల్ సీఐ హనుమంతు, ఎస్సైలు జగదీశ్వర్, తదితరులు పాల్గొన్నారు.