Veerabhadra Swamy Temple | గుమ్మడిదల, మార్చి 25 : సంగారెడ్డి జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంతపల్లి వీరభద్రస్వామి దేవాలయంలోని గర్భగుడి ద్వారాలకు బీఆర్ఎస్ నాయకులు భారీ విరాళం అందజేశారు. ఈ మేరకు ఇవాళ గుమ్మడిదల మున్సిపాలిటీలోని బొంతపల్లిలోని వీరభద్రస్వామి దేవాలయంలోని రూ.లక్ష 20వేలతో గర్భగుడి ద్వారాలు చేయించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు స్వామివారికి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు.
అర్చక స్వాములు ఆయనకు ఆశీర్వచనలు అందజేశారు. స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని దేవుడిని కోరుకున్నట్లు వారు తెలిపారు. గజవాహన సేవలో పాల్గొని పూజలు చేశారు. బుధవారం తెల్లవారు జామున బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారు విమాన రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు చైర్మన్ మద్ది ప్రతాప్‌రెడ్డి, ఈవో శశిధర్‌గుప్తా, జూనియర్ అసిస్టెంట్ సోమయ్యలు తెలిపారు.
Eknath Shinde | కమ్రా సుపారి తీసుకున్నట్లుంది.. కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
Bangladesh | మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు..? త్వరలో బంగ్లాలో సైనిక పాలన..?