ఝరాసంగం,జూలై3 : సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో భారీగా భక్తులు తరలి వచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు.
తెల్లవారు జామునుంచి అమృత గుండం నీటీతో పుణ్యస్నానాలు ఆచరించి గర్భ గుడిలోనున్న పార్వతి సమేత సంగమేశ్వరస్వామివారికి కుంకుమార్చన, రుద్రాభిషేకం, పాలాభిషేకం,బిల్వార్చన, అన్నపూజలు చేశారు.
చిన్నారులకు కేశఖండనాలు చేసి స్వామివారికి కొడెదూడలను కానుకలుగా సమర్పించుకున్నారు. ఆలయ మంటపంలో ఉన్న ఉత్సవ విగ్రహానికి భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.