గుమ్మడిదల,మే11: జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయంలో భక్తుల సందడితో కిటకిటలాడింది. వేసవి సెలవులు రావడంతో పాటు ఈ మాసంలో వివాహాలు జరుగుతుండడంతో నూతన వధూవరులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
జంటనగరాలతో పాటు దూర ప్రాంతాల్లో ఉన్న భక్తులు వీరభద్రస్వామివారినిదర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భద్రకాళీ అమ్మవారికి కుంకుమార్చనలు, వీరభద్రప్రస్తాయాలు, సామూహిక సత్య నారాయణ వ్రతాలు ఆచరిస్తున్నారు. వచ్చిన భక్తులకు ఈవో శశిధర్గుప్తా, జూనియర్ అసిస్టెంట్ సోమయ్య, ఆలయకమిటీ అధ్యక్షుడు మద్దిప్రతాప్రెడ్డి పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా పర్యవేక్షిస్తున్నారు.