మునిపల్లి, ఆగస్టు 06 : సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి-చందాపూర్ మధ్య నూతనంగా నిర్మిస్తున్న రోడ్డుపై కంకర పోసి వదిలేయడంతో కంకర రోడ్డుపై కన్నీళ్లతో ప్రయాణం సాగిస్తున్నట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన మునిపల్లి నుంచి సదాశివపేట మండలంలోని చందాపూర్ గ్రామ శివారు వరకు సుమారు (2.6) కిలోమీటర్లు కోటి యాభై లక్షల రూపాయలతో నూతన రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రయాణికులకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించేందుకు మంత్రి దామోదర రాజనర్సింహ చొరవ అభినందనీయం.
ఇంతవరకు అంత బాగానే ఉంది. అయితే సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తూ రోడ్డు తవ్వి కంకర పూసి వదిలేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు కంకర పోసి గత రెండు నెలలు గడుస్తున్నా నేటికీ రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి మునిపల్లి, చందాపూర్ రోడ్డు పనులు త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
ఎస్టిమేట్లో కల్వర్ట్ లేదనే తొలగించలేదా..?
మునిపల్లి నుంచి సదాశివపేట మండల పరిధిలోని చందాపూర్ శివారు వరకు నూతనంగా నిర్మాణం చేపడుతున్న రోడ్డు మధ్యలో ప్రమాదకరమైన కల్వర్ట్ దర్శనమిస్తుంది. కల్వర్టు ఉన్నట్లు సదరు కాంట్రాక్టర్ గమనించిన శిథిలవస్థలో చేరిన కల్వర్ట్ ను తొలగించకుండా రోడ్డుపై కంకర పోసి అలాగే నిర్మాణం చేపడుతున్నట్లు ప్రయాణికులు సంబంధిత కాంట్రాక్టు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరిగే మునిపల్లి- చందాపూర్ రోడ్డుపై భారీ వాహనాలు ఒక్కసారి తిరిగితే కల్వర్టు పూర్తిగా కూలిపోతుందని ప్రయాణికులు చెబుతున్నారు.
ఉన్నత అధికారులు స్పందించి మునిపల్లి-చందాపూర్ రోడ్డును నాణ్యతతో చేపట్టి ప్రమాదకరమైన కల్వర్ట్ ను తొలగించి నూతన కల్వర్ట్ ను నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. అయితే కల్వర్టు నిర్మాణంపై సదరు కాంట్రాక్టర్ వివరణ కోరగా ఎష్టమేట్ లో కల్వర్ట్ నిర్మాణం లేకపోవడంతోనే కల్వర్టు తొలగించలేదని ఆయన సమాధానమిచ్చారు. నూతన కల్వర్ట్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేస్తే మునిపల్లి-చందాపూర్ రోడ్డు మధ్యలో శిథిలమైన కాల్వర్ట్ తొలగించి నూతన కల్వర్ట్ నిర్మిస్తామన్నారు.
కల్వర్టు..