జహీరాబాద్, మార్చి 13 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు ఆరోపించారు. గురువారం జహీరాబాద్ పట్టణంలోని శ్రామిక్ భవన్లో ఏర్పాటు చేసిన సీఐటీయూ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఏండ్ల తరబడి ప్రభుత్వాలు పాత జీవోలను పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులకు కోమ్ముకస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
దీంతో కార్మికులకు సరైన వేతనాలు లభించక ఇబ్బందులకు గురువుతున్నారన్నారు. ప్రభుత్వాలు వెంటనే పాత జీవోలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త జీవోలను తీసుకువచ్చేలా చూడాలన్నారు. లేని పక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలను తీవ్రతారం చేస్తామని హెచ్ఛరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహయ కార్యదర్శి మహిపాల్, నాయకులు నర్సయ్య, గౌరవమ్మ, అనంద్, సత్తన్న తదితరులు పాల్గొన్నారు.