MuniPalli Mandal | మునిపల్లి, ఏప్రిల్ 13 : మునిపల్లి మండలంలోని చిన్నచల్మెడ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంతకీ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారా..? లేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారా..? అని చిన్నచల్మెడ గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి తీరుఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జెండా కట్టపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకుల బ్యానర్లు నిర్మాణం చేయడంఫై స్థానికులు స్థానిక పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇచ్చారు.
ఐనా పంచాయతీ కార్యదర్శి పట్టింపు లేనట్టు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ జెండా గద్దెపై కాంగ్రెస్ నాయకుల బ్యానర్లు తొలగింపుఫై నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి కిరణ్ఫై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏజెంటువా..? మునిపల్లి మండలంలోని చిన్నచెల్మడ గ్రామ పంచాయతీ కార్యదర్శి కిరణ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవా పంచాయతీ కార్యదర్శివా..? అంటూ గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శిని నిలదీస్తున్నారు. గ్రామంలో బీఆర్ఎస్ నాయకులఫై కక్ష సాధింపులు చర్యలు తీసుకుంటున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చెస్తున్నారు.
తాగునీటి తొట్టి పూర్తిగా ధ్వంసం..
కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టే విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల పనులపై నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విధులు నిర్వహిస్తున్న చిన్నచెల్మడ పంచాయతీ కార్యదర్శిఫై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
మాయమైన నీటి తొట్టి మండలంలోని చిన్నచెల్మడ గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన హనుమాన్ మందిర్ సమీపంలో గత 20 ఏళ్ల క్రితం నిర్మాణం చేపట్టిన పశువుల తాగునీటి నిమిత్తం నిర్మాణం చేపట్టిన పశువుల తాగునీటి తొట్టిని పంచాయతీ కార్యదర్శి అండతో కాంగ్రెస్ నాయకులు పూర్తిగా ధ్వంసం చేసినట్లు స్థానికులు తెలిపారు.
శ్రీరామనవమి సందర్బంగా హనుమాన్ ఆలయం ముందు చేపట్టిన పలు కార్యక్రమాలకు నీటితోట్టి ఇబ్బందిగా ఉన్నట్టు గ్రహించి రాత్రి రాత్రే పూర్తిగా తొలగించారు. పశువుల నీటి తొట్టి తొలగించడంలో పంచాయతీ కార్యదర్శి ప్రధాన పాత్ర ఉందన్నారు. కూల్చివేసిన పశువుల నీటి తొట్టి స్థానంలో తిరిగి అదే స్థలంలో నూతన పశువుల నీటి తొట్టిని నిర్మించాలి.. లేదంటే పంచాయతీ కార్యదర్శి తీరుఫై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరుగుతుందని స్థానికులు తెలిపారు. నిత్యం పశువుల తొట్టిలో పశువులు నీళ్లు తాగేవి… నీటి తొట్టి తొలగినప్పటి నుంచి.. రైతులు వారి వారి పశువులకు వారి ఇళ్ల వద్దనే నీళ్లు తాపెందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పశువుల తొట్టి నిర్మాణం ఏర్పాటు చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.

Jadcherla | పది రోజులుగా నీళ్లు బంద్..ఖాళీ బిందెలతోజడ్చర్ల మున్సిపాలిటీ ఎదుట ధర్నా
UK Migrant Rules | పదేళ్ల ఆవాసం తర్వాతే యూకేలో శాశ్వత నివాసం.. నిబంధనలు కఠినతరం..!