న్యాల్కల్ : న్యాల్కల్ మండల కేంద్రమైన న్యాల్కల్ గ్రామ సమీపంలోని దీర్ఘాయువు సాహెబ్ జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన పశువుల మేళకు పశువులు భారీ సంఖ్యలో తరలి వచ్చాయి.
ఏడాదికి ఒకసారి జరిగే ఈ పశువుల మేళ తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన రైతులు, వ్యాపారులు పశువులను భారీగా విక్రయించేందుకు కు తీసుకువచ్చారు. పశువులను రంగురంగుల రిబ్బన్లుతో అందంగా అలంకరించి మేళాకు తీసుకువచ్చారు.
50 వేల నుంచి రెండు లక్షల వరకు పశువుల విక్రయాలు జరిగాయి. ఝరాసంగం మండలం కుప్పం నగర్‌కు చెందిన శేఖర్ అనే రైతు రెండు ఎడ్ల జత లను లక్షా 60 వేల రూపాయలకు కొనుగోలు చేశారు.