Hanumakonda | కేడీసీలో ప్రపంచ హీమోగ్లోబిన్ అవగాహన దినోత్సవం
హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్వయంప్రతిపత్తి(కేడీసీ) బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ హీమోగ్లోబిన్ అవగాహన దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 13: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్వయంప్రతిపత్తి(కేడీసీ) బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ హీమోగ్లోబిన్ అవగాహన దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మానవ శరీరంలో ఆక్సిజన్ సరఫరాకు హీమోగ్లోబిన్ ఎంత కీలకమో వివరిస్తూ, రక్తహీనతను నివారించడం ద్వారానే చురుకైన విద్యార్థి దశ సాధ్యమని పేర్కొన్నారు. బయోటెక్నాలజీ విభాగాధిపతి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ ఐరన్ (ఇనుము) లోపాన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన ఆహార నియమాలపై అవగాహన కల్పించారు.
ముదురు ఆకుపచ్చ కూరగాయలు, ఎండు ఖర్జూరం, బీట్రూట్ వంటి పోషక విలువలున్న ఆహారం ద్వారా రక్తాన్ని వృద్ధి చేసుకోవచ్చని సూచించారు. అనంతరం రఘు మాట్లాడుతూ హీమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం వలన కలిగే తీవ్రమైన అలసట, ఏకాగ్రత లోపించడం వంటి దుష్ర్పభావాలను వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రజనీలత, కోమల్, సమ్మయ్య, దినేష్, సమత, శ్యామ్, యుగేందర్, మహేందర్, సీతారాములు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

