మునుగోడు, ఫిబ్రవరి 13 : లెవీలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మునుగోడులోని మురళి మనోహర్ రైస్ మిల్లుకు నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. లెవీలో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. లేవీ కింద తీసుకున్న ధాన్యం ఉండాల్సిన పరిమాణం కన్నా తక్కువగా ఉందని తేలడంతో సదరు మిల్లుకు నోటీసు అందజేసినట్లు పేర్కొన్నారు.