నల్లగొండ : నల్లగొండ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. 14వ వార్డులో బీఆరెస్ అభ్యర్థి గెలిచినా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లుగా అధికారులు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. దాంతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకుని బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే కంచర్ల కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులను తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. చివరికి నిరసనకారులను చెదరగొట్టేందుక పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.