Sri Chidambaram | టాలీవుడ్ నుంచి చిన్న సినిమాగా వచ్చి ప్రశంసలు అందుకున్న ‘శ్రీ చిదంబరం గారు’ చిత్రం విడుదలైన వారంలోపే ఓటీటీ అనౌన్స్మెంట్ను ప్రకటించింది. ఫిబ్రవరి 06న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురాగా.. అతి తక్కువ కాలంలోనే డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. వినయ్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫీల్-గుడ్ డ్రామా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ETV Win కైవసం చేసుకుంది. దీంతో ఈ సినిమాను ఫిబ్రవరి 19 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఈటీవీ విన్ ప్రకటించింది. యువ నటులు వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించగా.. ఈ చిత్రాన్ని చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రాజమండ్రిలోని ఒక పల్లెటూరిలో నివసించే సోలమన్ (వంశీ తుమ్మల)కు మెల్లకన్ను ఉంటుంది. దీంతో ఊరిలో ఉన్నవారందరూ అతడిని ‘చిదంబరం’ అని ఎగతాళి చేస్తుంటారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక సోలమాన్ తన చిన్నప్పుడే చదువు మానేస్తాడు. తన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎప్పుడూ కళ్లజోడు ధరిస్తుంటాడు. తండ్రి చేసిన అప్పుల వలన మేస్త్రీ పనులకు వెళ్తుంటాడు. అయితే అదే గ్రామానికి చెందిన లీలా (సంధ్య వశిష్ట)కు సోలమన్ అంటే ప్రాణం. కానీ, తన లోపం వల్ల ఆమె తనను ఇష్టపడదని భ్రమపడి సోలమన్ ఆమెకు దూరంగా ఉంటాడు. అయితే ఒక చిన్న అపార్థం వారి మధ్య దూరాన్ని ఎలా పెంచింది? చివరకు తన ఆత్మన్యూనతా భావాన్ని వదిలి సోలమన్ ప్రపంచాన్ని ధైర్యంగా ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే సినిమా కథ.
✨ A story that moved hearts and became a blockbuster sensation.#SriChidambaram
A Win Digital Premiere
Premieres on Feb 19
Only on @etvwin@worldofvamsi #SandhyaVasishta @VinayRatnam_ #ChintaVineeshaReddy #ChintaGopalaKrishnaReddy #ChintaRajasekharReddy @chandu_music… pic.twitter.com/EvW0ZQJOFP— ETV Win (@etvwin) February 13, 2026