BRS Ex Sarpanches | జహీరాబాద్, మార్చి 26 : పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మాజీ సర్పంచులు తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ ముట్టడికి వెళ్తున్న మాజీ సర్పంచులను, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం రాత్రే రంగంలోకి దిగారు. గురువారం తెల్లవారుజాము వేళల్లో బీఆర్ఎస్ మాజీ సర్పంచుల ఇళ్ల వద్దకు వెళ్లారు.
ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసి హద్నూర్ పోలీసు స్టేషన్లకు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. న్యాల్కల్ మండలం మామిద్గి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌తో పాటు చీకుర్తి గ్రామం చెందిన మాజీ సర్పంచ్ భర్త భూమారెడ్డినీ అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము చలో హైదరాబాద్ వెళ్లడం లేదని చెప్పినా వినకుండా పోలీసులు తమను అరెస్టు చేశారని మండిపడ్డారు. కొద్ది నెలలుగా తాము చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన ప్రతిసారీ తమను ఇలాగే పోలీసులతో ప్రభుత్వం అరెస్టు చేయిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బిల్లులను, బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
BRS : కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండ : రావులపల్లి రాంప్రసాద్
TTD | టీటీడీకి తిరుమల విద్యా సంస్థల చైర్మన్ భారీ విరాళం
Road Accident | సికింద్రాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి