Zaheerabad | జహీరాబాద్లో జోరుగా బీఆర్ఎస్ ప్రచారం.. గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్న గులాబీ దండు
జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో(Muncipal elections) బీఆర్ఎస్ ప్రచారం హోరెత్తుతోంది.
జహీరాబాద్, ఫిబ్రవరి 8 : జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో(Muncipal elections) బీఆర్ఎస్ ప్రచారం హోరెత్తుతోంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియకు ముందే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బీఆర్ఎస్.. పోలింగ్ సమయం సమీపిస్తుండడంతో వేగం పెంచింది. జహీరాబాద్ మున్సిపాలిటీలో మళ్లీ బీఆర్ఎస్ జెండాలు ఎగురవేయాలనే లక్ష్యంతో ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ముందుకుసాగుతున్నారు. వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రత్యర్థి పార్టీల కంటే ముందువరుసలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రాష్ట్ర అధినాయకత్వం స్థానిక మున్సిపాలిటీకి ప్రత్యేక ఎన్నికల ఇన్చార్జిగా రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ ను నియమించింది.
అభ్యర్థుల విజయానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంహెచ్ చైర్మన్ శివకుమార్ తదితరులు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం కోసం పట్టణంలోని 37 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయమే లక్ష్యంగా పార్టీ నేతలు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ శ్రేణుల్లో భరోసా నింపుతూ అభ్యర్థుల విజయం కోసం పాటుపడుతున్నారు. పార్టీ నేతలు అభ్యర్థులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి, గత బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధి గురించి ప్రతి ఓటరుకూ వివరిస్తున్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

