సంగారెడ్డి అర్బన్, జనవరి 4 : సంగారెడ్డి మెడికల్ కా లేజీలో మెరుగైన సేవలందించి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని ప్రొఫెసర్లకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. మంగళవారం సంగారెడ్డి మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించి, పలు సూ చనలు, సలహాలిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడారు. సమన్వయంతో పని చేసి మంచి ఫలితాలు సాధించి, ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగస్వాము లు కావాలని ప్రొఫెసర్లకు సూచించారు. గాంధీ, ఉస్మానియాకు కేసులు పంపకుండా సంగారెడ్డిలోనే పూర్తి చికిత్సలు అందించేందుకు కృషి చేయాలని, ఆరోగ్యశ్రీ, ఆ యుష్మాన్ భారత్ సేవలు వినియోగించుకోవాలన్నారు. ఎలాంటి నిధుల కొరత లేదని, కావాల్సినన్ని అందుబాటులో ఉన్నాయని, ఓనర్ షిప్‌తో పని చేయాలన్నారు. అనంతరం ఎంసీహెచ్‌ను మంత్రి సందర్శించి, ప్రసవాలపై ఆరా తీశారు. టీనేజర్లకు కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. వ్యాక్సిన్ తీసుకున్న విద్యార్థులతో మాట్లాడి, ఏమైనా ఇబ్బందిగా ఉందా? అని అడిగారు. టీనేజర్ల వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని, వ్యాక్సిన్‌కు ముందుకురాని వారిని గుర్తించాలని, వారికి అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో గాయత్రిదేవిని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ దవాఖాన ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు. ఆక్సిజన్ నిల్వ కెపాసిటీ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జహీరాబాద్, అందోల్ ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, క్రాంతికిరణ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షిషా, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.