Bakki Venkataiah | సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని సజ్జాపూర్ గ్రామంలో తనకు ఓటు వేయలేదని ఇంటి నిర్మాణాన్ని కూల్చివేసిన బేగరి రాములు కుటుంబానికి అండగా ఉంటామని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హామీ ఇచ్చారు. బుధవారం సజ్జాపూర్ గ్రామంలో కూల్చి వేసిన బేగరి రాములు ఇంటిని బక్కి వెంకటయ్య పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రజల నుంచి అభిప్రాయం సేకరించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని బక్కి వెంకటయ్య కలెక్టర్‌కు సూచించారు. ఈ ఘటనకు సంబంధించి పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
Mahabubabad | కిరాణా షాప్, బైక్ దగ్ధం..బోడమంచ్యా తండాలో ఉద్రిక్తత : వీడియో
Watch: వీల్‌చైర్ అందుకున్న తర్వాత నడిచిన లబ్ధిదారుడు.. వీడియో వైరల్
Military Camp | మిలిటరీ క్యాంప్‌లో కాల్పులు.. ఆర్మీ ఆఫీసర్ మృత