హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ్యా తండాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న తండాలో జరిగిన వీరన్న హత్యకు ప్రతీకారంగా అనుమానితుల ఇండ్లపై మృతుడి బంధువుల దాడికి పాల్పడ్డారు.వీరన్న హత్యకు కారకులైన.. తండాలోని ఆర్ఎంపీ వైద్యుడు భరత్, బాలు ఇండ్ల పై దాడి భరత్ ద్విచక్ర వాహనం, కిరాణా షాప్ను దగ్ధం చేశారు. మరో అనుమానితుడు బాలు ఇంటిని ధ్వంసం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
తండా వాసులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరు పోలీసులకు గాయాలవ్వగా హాస్పిటల్ తరలించారు.తండాలో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. కాగా, వీరన్న హత్యలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడితో కలిసి భార్య విజయే భర్తను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. భర్తను హత్య చేసి ఆపై ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు. అయితే మృతుడి పేరుపై ముందే రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ చేయించారు భార్య విజయ, ఆమె ప్రియుడు ఆర్ఎం డాక్టర్ భరత్. ఈ కారణంగానే భర్తను దారుణంగా హత్య చేసినట్లు విచారణలో పోలీసులు తేల్చారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ్యా తండాలో ఉద్రిక్తత
నిన్న తండాలో జరిగిన వీరన్న హత్యకు ప్రతీకారంగా అనుమానితుల ఇండ్లపై మృతుడి బంధువుల దాడి
వీరన్న హత్యకు కారకులైన.. తండాలోని ఆర్ఎంపీ వైద్యుడు భరత్, బాలు ఇండ్ల పై దాడి
భరత్ ద్విచక్ర వాహనం, కిరాణా షాప్ను దగ్ధం చేసిన మృతుడి… pic.twitter.com/gPQ1FBfd0E
— Telugu Scribe (@TeluguScribe) December 24, 2025