సంగారెడ్డి జిల్లా మానూరు పోలీస్ స్టేషన్ ముందు తీవ్ర విషాదం నెలకొంది. ఏఎస్సై గోవింద్ నాయక్పైకి పోలీసు వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏఎస్సైని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఈ ఘటన అనంతరం పోలీస్ వాహనం నడిపిన హోంగార్డు రామారావు పరారైనట్లు తెలుస్తోంది. కాగా, ఇది ప్రమాదం కాదని.. కక్షపూరితంగానే రామారావు వాహనంతో ఢీకొట్టాడని ఏఎస్సై కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.