సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులతో అందోల్ సస్యశ్యామలం
అందోల్ సస్యశ్యామలం | సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు తీసుకు వచ్చి అందోల్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ధన్యవాదాలు తెలిపారు.

అందోల్,సెప్టెంబర్ 27 : సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు తీసుకు వచ్చి అందోల్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ధన్యవాదాలు తెలిపారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ నియోజకవర్గంలోని పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు.
అలాగే సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నారు. ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో ప్రతి రోజు పర్యాటకులు వేల సంఖ్యలో ప్రాజెక్టును సందర్శించేందుకు వస్తున్నారని, అక్కడ సరియైన మౌలిక వసతులు లేక పోవడంతో సందర్శకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.
అలాగే సింగూరు ప్రాజెక్టు నుంచి అందోల్, పుల్కల్ మండలాలకు వెళ్తున్న కెనాల్ కాలువలకు సీపీ లైనింగ్ లేక పోవడం వల్ల నీటి సరఫరా అస్తవ్యస్తంగా అవుతుండంతో రైతులకు సాగు నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. సీపీ లైనింగ్ నిర్మాణానికి అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

