School | నిజాంపేట్, జూన్ 26 : బాలికల పాఠశాల ప్రాంగణంలో రైతులు తమ వ్యవసాయ యంత్రాల పనిముట్లు ట్రాక్టర్లను వదిలివెళ్లడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన నిజాంపేట్‌లోని బాలికల ప్రాథమిక పాఠశాల ఆవరణలో రైతులు తమ వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు, ట్రాక్టర్లు ఇతర వస్తువులు వదిలి వెళ్లడంతో విద్యార్థులకు ఆటలాడుకోవడానికి ఇబ్బందికరంగా మారింది.
పాఠశాల ప్రాంగణంలో అంగన్వాడి సెంటర్, ఉర్దూ పాఠశాలతోపాటు మూడు పాఠశాలలు కొనసాగుతున్నాయి. పాఠశాలకు చుట్టూ ప్రహరి లేకపోవడంతో రైతులు తమ ట్రాక్టర్లను వ్యవసాయ పనిముట్లను వదిలివెళ్లి పోవడమే కాక మరి కొంతమంది అసాంఘీక కార్యకలాపాలకు పాలుపడుతున్నరు. ఉదయం పాఠశాలకు వచ్చే సరికి మత్తు పదార్థాల వంటి వస్తువులు, పగిలిన సీస ముక్కలు దర్శనం ఇస్తుండటంతో విద్యార్థులకు ఆటలాడుకొనుటకు ఇబ్బందికరంగా మారింది.
అధికారులు, గ్రామ పేద్దలు ఇటువైపు దృష్టిసారించి చొరవ తీసుకోని పాఠశాల లోని యంత్రాలను తీయించి పాఠశాలకు ప్రహరి నిర్మింపజేయాలని విద్యార్థుల తల్లిదడ్రులు, పాఠశాల సిబ్బంది కోరుతున్నారు. ఇంతకు ముందు ఇదే పాఠశాలలో మంచినీటి సరఫరా ట్యాంకు శిథిలావస్థకు చేరడంతో నమస్తే తెలంగాణ దినపత్రిక చొరవతో అదికారులు తొలగించడం జరిగింది. అందుకు పాఠశాల సిబ్బంది, చుట్టు ప్రక్కల ప్రజలు, ధన్యవాదాలు తెలిపారు.
Jagtial | జగిత్యాల జిల్లాలో కొండెక్కిన చింత చిగురు ధరలు.. కిలో ఎంతంటే?
MLC Kavitha | రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Stampede | పాఠశాల వద్ద పేలుడు.. తొక్కిసలాటలో 29 మంది చిన్నారులు మృతి