నిజాంపేట్, జూన్13 : రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఏఈఓ వంశీకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ గ్రామానికి చెందిన రైతులందరూ కొత్తగా భూమి కొనుగోలు చేసిన, పేర్లు మార్పిడి చేసుకున్న వారందరూ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు ఈ నెల 20వ తేదీ వరకు తీసుకుంటారన్నారు. దరఖాస్తు కోసం పట్టా పాస్ బుక్కు, ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు, బ్యాంక్ సేవింగ్ అకౌంట్ జతపరచి నిజాంపేట్ లోని రైతు వేదికలో అందజేయాలని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Grounding Boeing 787-8 Fleet | బోయింగ్ 787-8 విమానాలను గ్రౌండింగ్ చేసేందుకు కేంద్రం యోచన
Air India plane crash | అంత్యక్రియల కోసం లండన్‌కు వెళ్తున్న ఫ్యామిలీ.. విమాన ప్రమాదంలో మృతి
Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంలో నర్సు మృతి.. డిప్యూటీ తహసిల్దార్‌పై సస్పెన్షన్