మనూర్ : విత్తనాలు అమ్మే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏడీఏ నూతన్ కుమార్ అన్నారు. గురువారం మనూర్ రైతు వేదికలో ఫర్టి లైజర్ నిర్వాహకులకు సమావేశం నిర్వహించారు. గుర్తింపు పొందిన విత్తనాలు మాత్రమే అమ్మడంతో పాటు ఒరిజినల్ బిల్లులు మాత్రమే ఇవ్వాలన్నారు. నకిలీ విత్తనాలకు తావులేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవన్నారు. విత్తనాలు, ఎరువులు ఎమ్మార్పి ధరలకు మాత్రమే అమ్మాలన్నారు.
తేదీ దాటినా మందులు షాపులో ఉండకూడదని, అలాంటి మందులు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో మహేష్ చౌహన్, ఏఈ ఓ సంగమేష్, డీలర్లు మారుతి, జైపాల్ రెడ్డి, శంకర్, శ్రీకాంత్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, పవన్, రాజయ్య, స్వామి పాల్గొన్నారు.