Women Murder Case | జహీరాబాద్, ఏప్రిల్ 5 : జహీరాబాద్ పట్టణ పరిధిలోని పస్తాపూర్‌లో ఇటీవల జరిగిన ఓ మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 30వ తేదీన స్థానిక పట్టణ పరిధిలోని పస్తాపూర్ సమీపంలోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ సమీపంలోని కాలనీలో ఓ మహిళ కంట్లో కారంపొడి చల్లి సిలిండర్‌తో దారుణ హత్యకు పాల్పడిన సంఘటన తెలిసిందే.
ఈ హత్యకు పాల్పడిన నిందితుడు హైదరాబాద్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం, ఎస్సై కాశీనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి స్థానిక పట్టణ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇవాళ మహిళ హత్యకు పాల్పడిన నిందితుడి అరెస్టు వివరాలను వెల్లడించారు.
వేరే వాళ్లతో ఉంటుందని..
కోహీర్ మండలం గొట్టిగారిపల్లికి చెందిన సత్యారం రమేష్ అనే వ్యక్తి ఝరాసంఘం మండలం చీలే మామిడికి చెందిన లక్ష్మితో కలిసి గత కొంతకాలంగా సహజీవనం కొనసాగిస్తున్నారు. సత్యారం రమేష్ ప్రవర్తన సరిగా లేనందున లక్ష్మి అతన్ని దూరం పెట్టి వేరే వాళ్లతో ఉంటుందన్న నెపంతో గత నెల 29వ తేదీన ఆర్టీఏ చెక్‌పోస్ట్ దగ్గర ఉన్న కల్లు దుకాణంలో ఆమెతో కలిసి కల్లు తాగాడు. అనంతరం ఆమెను పెట్రోల్ పోసి చంపేందుకు ప్రయత్నించగా.. అక్కడే ఉన్న మరో మహిళా మ్యాతరి మరియమ్మ అడ్డురావడంతో హత్యకు పాల్పడే ప్రయత్నాలు ఫలించలేదు.
గత నెల 30వ తేదీన ఉదయం లక్ష్మి ఇంటికి సత్యారం రమేష్ వెళ్లాడు. తనతో పడుకోమని బలవంతం చేయగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో సత్యారం రమేష్ లక్ష్మి కంట్లో కారంపూడి చల్లి, పక్కనే ఉన్న ఐదు కిలోల గ్యాస్ సిలిండర్‌తో ఆమె తలపై బలంగా దాడి చేయడంతో కిందపడి మృతి చెందింది.
లక్ష్మీ అరుపులు విన్న పక్కింటివాళ్లు అక్కడికి రావడంతో సత్యారం రమేష్ అక్కడి నుంచి సెల్ ఫోన్ తీసుకొని గోడదూకి పారిపోయాడు. ఈ మేరకు జహీరాబాద్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సత్యారం రమేష్ ఉదయం 9 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు పారిపోతుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
హత్యకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి జహీరాబాద్ కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం, ఎస్సై కాశీనాథ్, ట్రైన్ ఎస్సై సుజిత్, హెడ్ కానిస్టే బుల్ హోమ్ దేవ్, సిబ్బంది ఆనంద్‌లను డీఎస్పీ అభినందించారు.
Passengers | 40 గంటలుగా తుర్కియే ఎయిర్‌పోర్ట్‌లోనే.. వసతుల లేమితో భారతీయ ప్రయాణికుల అవస్థలు
Alampur | అలంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గవ్వల శ్రీనివాసులు
Taj Mahal: టికెట్ సేల్స్ ద్వారా ఆదాయం.. టాప్‌లో తాజ్‌మహల్