గుమ్మడిదల,ఆగస్టు3 : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధి దోమడుగులో చోటు చేసుకుంది. ఎస్సై విజయకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మెదక్ జిల్లా, శివంపేట మండలం, గోమారం గ్రామానికి చెందిన బిట్ల నాగరాజు(25) అనే యువకుడుమంగళవారం రాత్రి అన్నారం గ్రామం నుంచి దోమడుగు వైపు బైక్పై వెళుతున్నాడు. ఇదే సమయంలో దోమడుగు గ్రామశివారులోని పుల్లారెడ్డి ఫార్మా కళాశాల సమీపంలో రోడ్డు పక్కన మంచినీటి ట్రాక్టర్ ట్యాంకర్ పార్క్ చేశారు.
అది గమనించని నాగరాజు ట్యాంకర్ను ఢీ కొట్టాడు. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.