Australia | దక్షిణాఫ్రికా పర్యటనకు ఆస్ట్రేలియా.. ఆ వివాదం తర్వాత ఎనిమిదేళ్లకు..!
Australia : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా(Australia) సుదీర్ఘ విరామం తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. సాండ్‌పేపర్‌గేట్ (Sandpapergate) వివాదం తర్వాత ఎనిమిదేళ్లకు ఆసీస్ ఆ దేశంలో అడుగుపెట్టనుంది.
Australia : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా(Australia) సుదీర్ఘ విరామం తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. సాండ్‌పేపర్‌గేట్ (Sandpapergate) వివాదం తర్వాత ఎనిమిదేళ్లకు ఆసీస్ ఆ దేశంలో అడుగుపెట్టనుంది. రెండు ఫార్మాట్ల సిరీస్‌లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని కంగారూ టీమ్ సఫారీలతో తలపడనుంది. ఇరుజట్ల మధ్య మొదట వన్డే, ఆపై టెస్టు సిరీస్ జరుగనుంది. రెండు దేశాల బోర్డులు సోమవారం ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.
డబ్ల్యూటీసీలో ఆస్ట్రేలియా సెప్టెంబర్‌లో కీలకమైన సిరీస్ ఆడనుంది. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల్లో కమిన్స్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. సఫారీలపై 2018లో సాండ్‌పేపర్ గేట్ వివాదం తర్వాత ఆసీస్ జట్టుకు ఇదే తొలి పర్యటన. అప్పుడు స్టీవ్ స్మిత్ సారథ్యంలో ఆడిన కంగారూలు.. కేప్‌టౌన్ టెస్టులో అనూహ్యంగా వివాదంలో చిక్కుకున్నారు. కామెరూన్ బాన్‌క్రాప్ట్ బంతి ఆకారాన్ని మార్చేందుకు సాండ్ పేపర్‌తో రుద్దడం వీడియోల్లో రికార్డైంది. అతడికి కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సహకరించారు. దాంతో.. ఈ ముగ్గురిపై ఆస్ట్రేలియా క్రికెట్ నిషేధం విధించింది.
🚨SOUTH AFRICA’S BLOCKBUSTER SUMMER🚨
In their 2026-27 home season, South Africa will host Australia and England in Tests and ODIs.
Bangladesh will also be touring South Africa to play ODIs, Tests and T20Is. pic.twitter.com/Q56eeXyRLc
— Cricbuzz (@cricbuzz) February 23, 2026
విచారణ అనంతరం స్మిత్, వార్నర్ ఏడాదిపాటు సస్పెండ్ అయ్యారు. బాన్‌క్రాప్ట్ 9 నెలలు ఆటకు దూరమయ్యాడు. ఈ ఘటనతోనే స్మిత్ కెప్టెన్సీ పోగుట్టుకోగా.. టిమ్ పైన్ నయా సారథిగా ఎంపికయ్యాడు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఆసీస్ మళ్లీ కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్ ఆడనుంది. అప్పుడు జట్టు సభ్యులైన కమిన్స్, లియన్, మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్‌లు ఈసారి కూడా ఆడబోతున్నారు.
వన్డే సిరీస్ : తొలి వన్డే – సెప్టెంబర్ 24, కింగ్స్‌మీడ్ స్టేడియం, డర్బన్.
రెండో వన్డే -సెప్టెంబర్ 27, వాండెరరన్స్ స్టేడియం (జొహన్నెస్‌బర్గ్).
మూడో వన్డే (డే /నైట్) – సెప్టెంబర్ 30న జేబీ మార్క్స్ ఓవల్ స్టేడియంలో.
టెస్టు సిరీస్ : తొలి టెస్టు అక్టోబర్ 9-13, కింగ్స్‌మీడ్ స్టేడియం, డర్బన్.
రెండో టెస్టు అక్టోబర్ 18-22, సెయింట్ జార్జ్స్ పార్క్, కెబెర్హా.
మూడో టెస్టు అక్టోబర్ 27-31, న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్‌టౌన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

