సంగారెడ్డి : జిల్లాలో ఘో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, లారీ ఢీ కొనడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన చౌటకూర్ మండలం సరాఫ్ పల్లి లిక్కర్ కంపెనీ వద్ద గల నాందేడ్ – అఖోల 161వ జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను 108 వాహనంలో సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
కాగా,జాతీయ రహదారి పై ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చెయ్యకుండా నిర్మాణం కొనసాగిస్తుండడంతో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.