సంగారెడ్డి : జిల్లాలోని పటాన్చెరు మండలం రుద్రారం వద్ద పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ముత్తంగి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. తనిఖీల వద్ద ఆపకుండా ఓ కారు వెళ్లిపోయింది. దీంతో ఆ కారును పోలీసులు వెంబడించారు. రుద్రారం వద్ద దుండగులు కారును వదిలేసి వెళ్లిపోయారు. కారును తనిఖీ చేయగా.. అందులో 224 కిలోల గంజాయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గంజాయిని విజయవాడ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే గంజాయిని సీజ్ చేసి కారును స్టేషన్కు తరలించారు.