పటాన్చెరు రూరల్, ఫిబ్రవరి 18: సమిష్టి విజయానికి ప్రతీక ఇంద్రేశం అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్న మున్సిపాలిటీ ఇన్చార్జి గోసుల శ్రీనివాస్‌యాదవ్, కోఆర్డ్డినేటర్ మెట్టు కుమార్‌యాదవ్‌ను బుధవారం బీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డితో కలిసి ఆయన అభినందించారు. ఈ సందర్భంగా వారిని హరీశ్‌రావు సన్మానించి మాట్లాడారు. బీఆర్ఎస్కు మెజారిటీ వచ్చేలా ఎన్నికల్లో కష్టపడిన గోసుల శ్రీనివాస్, మెట్టు కుమార్‌యాదవ్ సేవలను కొనియాడారు.
ఆదర్శ్‌రెడ్డి అందరి సమన్వయం కోసం శ్రమించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్కోసం శ్రమించిన వారిని తప్పకుండా పార్టీ గుర్తిస్తుందన్నారు. బీఆర్ఎస్ పటాన్‌చెరులోని ఐదు ము న్సిపాలిటీల్లో గెలువడంపై ప్రశంసించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వార్డుల వారీగా శ్రమించారని అభినందించారు. మెట్టు కుమార్‌యాదవ్ సొదరుడు దవాఖానలో ఉన్నప్పటికి, గోసుల శ్రీనివాస్‌యాదవ్ తల్లి కూడా దవాఖానలో ఉన్నా ఎన్నికల్లో విజ యం కోసం వారు శ్రమించిన తీరు పార్టీ వర్గాలకు స్ఫూర్తిదాయకమన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను దిగ్విజయంగా గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.