పనులు వేగంగా పూర్తిచేయండి
జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో పంచాయతీరాజ్, విద్య, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
- అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి
- ఈనెల 20లోగా జీపీల్లో వందశాతం పన్ను వసూలు చేయాలి
- ‘మనఊరు- మనబడి’ లక్ష్యాన్ని చేరుకోవాలి
- రోడ్ల మరమ్మతులు ప్రారంభించండి
- అధికారులతో సమీక్షలో సంగారెడ్డి కలెక్టర్ శరత్
సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 15: జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో పంచాయతీరాజ్, విద్య, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో మనఊరు -మనబడి, బీస్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్,టీ రెన్యువల్స్, సీసీ రోడ్లు, లేబర్ మొబిలైజేషన్, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు తదితర అంశాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో సీసీ రోడ్డు పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రతిరోజు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్లాలని హితవు పలికారు. పూర్తయిన పనులకు సంబంధించి వెనువెంటనే రికార్డు చేయాలని, ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ (ఎఫ్టీఓ)లను జనరేట్ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మనఊరు -మనబడి పనులు త్వరితగతిన పూర్తి కావాలన్నారు. పెండింగ్ ఎఫ్‌టీవోలు అన్నింటిని వెంటనే అప్లోడ్ చేయాలన్నారు. పెయింటింగ్, డ్యూయల్ డెస్క్‌ల ఏర్పాటు, తదితర పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకురావాలని డీఈవోకు సూచించారు.
100 శాతం పనులు గ్రౌండింగ్ చేయాలి..
ప్రతి గ్రామంలో వంద శాతం పనులు గ్రౌండింగ్ చేసి పూర్తి చేయాలని కలెక్టర్ డీపీవోను ఆదేశించారు. ఈనెల 20లోగా 50 శాతం లేబర్ మొబిలైజేషన్ కావాలని సూచించారు. పనులు చేయని ఆయా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓను ఆదేశించారు. జిల్లాలో లేబర్ మొబిలైజేషన్‌తో పాటు ఆయా అభివృద్ధి పనులు వేగంగా జరగడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 20లోగా అన్ని గ్రామ పంచాయతీల్లో 100 శాతం పన్ను వసూ లు కావాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్డీవో శ్రీనివాసరావు, డీపీవో సురేశ్ మోహన్, డీఈవో నాంపల్లి రాజేశ్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ జగదీశ్వర్, ఏపీడీ జయదేవ్, వివిధ ఇంజినీరింగ్ ఈఈలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

