e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home మెదక్ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి

కొల్చారం, జూలై 13: ప్రతి ఒక్కరూ భౌతిక దూరంతో పాటు మాస్క్‌ ధరించాలని , ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకునేలా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బాధ్యత తీసుకోవాలని ఎంపీపీ మంజుల అన్నారు. మండల పరిషత్‌ సమావేశా న్ని ఎంపీపీ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఇందులో వ్యవసాయానికి సంబంధించిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామాల్లో నెలకొన్న విద్యుత్‌ సమస్యలపై అధికారులు చొరవ తీసుకోవాలని ఏఈ మహుమూద్‌ అలీకి సూచించారు. మండలంలో వరి నా ట్లు సాగుతున్న తరుణంలో ఎరువులు, యూరియా కొరత లేకుండా పీఏసీఎస్‌లకు, ఆగ్రో కేంద్రాలకు, ఫర్టిలైజర్‌ దుకాణాలకు అనుమతులు ఇచ్చినట్లు మండల వ్యవ సాయాధికారి బాల్‌రెడ్డి తెలిపారు. మండల వ్యాప్తంగా నాల్గో విడుత పల్లె ప్రగతిలో పారిశుధ్యం, హరితహారానికి పెద్దపీట వేసి పనులు నిర్వహిం చినట్లు మండల పంచాయతీ అధికారి కృష్ణవేణి తెలిపారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులకోసం అన్ని చర్యలు తీసుకున్నామని ఎంఈ వో నీలకంఠం తెలిపారు. ఈ సమావే శంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లకు అవకాశం కల్పించడంపై కిష్టాపూర్‌ సొసైటీ చైర్మ న్‌ మల్లేశంగౌడ్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ మేఘమా ల, వైస్‌ ఎంపీపీ మల్లారెడ్డి, మండల పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు మౌలానాసాబ్‌, మండల ప్రత్యేకాధికారిబాబునాయక్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ కిషన్‌, ఎంపీ డీవో ప్రవీణ్‌కుమార్‌, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి

ట్రెండింగ్‌

Advertisement