చేర్యాల, అక్టోబర్ 6: సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీ, మొండిచింత కాలనీల వద్ద ఆర్టీసీ బస్సులు ఆపాలని కోరుతూ సోమవారం ఆయా కాలనీలకు చెందిన ప్రజలు సీపీఎం ఆధ్వర్యంలో జనగామ-సిద్దిపేట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి బండకింది అరుణ్‌కుమార్ మాట్లాడుతూ కాలనీ ప్రజలు తమ అవసరాల కోసం వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులు ఆపడం లేదన్నారు.
విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టణానికి కాలనీలు చివర ఉండడంతో బస్సులు ఆపడం లేదని, ఆర్టీసీ అధికారులు స్పందించి కాలనీల వద్ద రిక్వెస్ట్ బస్టాపు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు తుమ్మపల్లి అనిల్, బోయిన మల్లేశం, భాస్కర్, రామ్‌ప్రసాద్, కాలనీ ప్రజలు చందర్, భిక్షపతి, పరమేశ్వర్, లచ్వవ్వ, వెంకటలక్ష్మి, మల్లయ్య, భారతి, లక్ష్మి, పద్మ, కిష్టవ్వ, మమత, రేఖ పాల్గొన్నారు.