మాజీ ఎమ్మెల్యే వాసురెడ్డి ఇకలేరు
మెదక్ జిల్లా రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ వాసురెడ్డి (80) గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. చేగుంట మండలం పోలంపల్లి గ్రామానికి రామన్నగారి శ్రీనివాస్‌రెడ్డి (ఆర్ఎస్ వాసురెడ్డి) రామాయంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
- చేగుంట మండలం పోలంపల్లిలో మృతి
- సంతాపం తెలిపిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు
- నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు
చేగుంట, సెప్టెంబర్ 21 : మెదక్ జిల్లా రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ వాసురెడ్డి (80) గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. చేగుంట మండలం పోలంపల్లి గ్రామానికి రామన్నగారి శ్రీనివాస్‌రెడ్డి (ఆర్ఎస్ వాసురెడ్డి) రామాయంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. శ్రీనివాస్‌రెడ్డి 1971లో చేగుంట ఉప సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం రెడ్డిపల్లి పీఏసీఎస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ, టీడీపీ పొత్తులో భాగం గా బీజేపీ నుంచి అవకాశం రావడంతో 1984 నుంచి 1989 వరకు రామాయంపేట నియోజక వర్గం ఎమ్మెల్యేగా పని చేశారు. తరువాత తెలంగాణ రాష్ట్రసమితిలో పనిచేస్తూ మెదక్ జిల్లా కన్వీనర్‌గా కీలకంగా పనిచేశారు.
ఆయన హ యాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను గెలిపించారు. అనారోగ్యంతో కొంతకాలం గా రాజకీయాలకు దూరంగా స్వగ్రామం పోలంపల్లిలో ఉన్నారు. వాసురెడ్డికి భార్య పద్మ, కూతుళ్లు వసంత, జయంతి, కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు. వాసురెడ్డి మృతితో స్వగ్రామం పోలంపల్లితోపాటు మెదక్ జిల్లాలో విషాదం అలుముకున్నది. వాసురెడ్డి మృతిపై ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ఆయన పార్థివదేహాన్ని సందర్శించి, సంతాపం తెలిపారు. చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, సర్పంచ్ యెన్నెలి నిర్మలసత్యం, ఎమ్మెల్యే రఘునందన్‌రావు తదితరులు వాసురెడ్డి పార్థివదేహం వద్ద పూల గుచ్ఛం పెట్టి నివాళులర్పించారు. చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో శుక్రవారం వాసురెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

