మెదక్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : మెదక్ నియోజకవర్గంలోని మెదక్, హవేళీఘనాపూర్, పాపన్నపేట, రా మాయంపేట, చిన్న శంకరంపేట, నిజాంపేట, నార్సింగి మండలాల్లోని గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణానికి రూ.15.90 కోట్లు మంజూరయ్యాయ ని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఎమ్మె ల్యే ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. గ్రా మాల్లోని ప్రతి వీధిలో సీసీరోడ్డు వేస్తా మన్నారు. మెదక్ నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధు లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు, పంచా యతీరాజ్ మంత్రి దయాకర్రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు.
మండలాల వారీగా నిధుల వివరాలు మెదక్ మండలానికి రూ. 1.60 కోట్లు
చిట్యాల, గుట్టకిందిపల్లి, జానకంపల్లి, కొంటూర్ మగ్ధంపూర్, మక్తభూపతిపూర్, పాతూర్, సంగాయిగూడాతండా, శివ్వాయిపల్లి, తిమ్మానగర్, వెంకటాపూర్ గ్రామాలకు రూ.10 లక్షలు, పేరూర్ గ్రామానికి రూ.20 లక్షలు, రాజ్‌పల్లి రూ. 30 లక్షలు మంజూరయ్యాయి.
హవేళీఘనపూర్ మండలానికి రూ. 2 కోట్లు
ఔరంగాబాద్తండా, తిమ్మాయిపల్లి(బీ), చౌట్లపల్లి, జకన్నపేట్, కుచన్‌పల్లి, లింగ్సాన్పల్లితండా, రాజుపేట, రాజుపేట తండా, సూల్తండా, శమ్నాపూర్, సుల్తాన్పూర్ తండాలకు రూ.10 లక్షలు, బూరుగుపల్లికి రూ.20 లక్షలు, బ్యాతోల్కు రూ.20 లక్షలు, గాజిరెడ్డిపల్లికి రూ.30 లక్షలు, తొగిట గ్రామానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయి.
పాపన్నపేట మండలానికి రూ. 4.65కోట్లు
అమ్రియ తండా, అన్నారం, అరికెల, తమ్మాయపల్లి, బాచారం, చీకోడ్, దాఖియా తండా(సోమల తండా) ఎంకేపల్లి, లక్ష్మీనగర్, మిన్పూర్, నామాపూర్, నార్సింగి, నార్సిం గ్రావుపల్లి తండా, పొడ్చన్‌పల్లి తండా, సీతానగర్, తుమ్మలపల్లి గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున రూ.1.50 కోట్లు, పాత లింగయ్యపల్లి, నాగ్సాన్పల్లి గ్రామాలకు రూ.30 లక్షలు, గాజులగూడెం, గాంధారిపల్లి, కొడపాక, కొత్తపల్లి, కొత్తలింగయ్యపల్లి, మల్లంపేట, ముద్దాపూర్, ఏటిగడ్డ, ఎల్లాపూర్, యూసఫ్పేట్కు రూ.20 లక్షల చొప్పున రూ.1.80 కోట్లు, కుర్తివాడకు రూ.30 లక్ష లు, పాపన్నపేటకు రూ. 50 లక్షలు, పొడ్చన్‌పల్లికి రూ.25 లక్షలు మంజూరయ్యాయి.
రామాయంపేట మండలానికి రూ. 2.25కోట్లు
దంతపల్లి, ధర్మారం, లక్ష్మాపూర్, పర్వతాపూర్, రాయలపూర్, శివాయపల్లి, తొనిగండ్ల గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున రూ.70లక్షలు, అకన్నపేట రూ.40లక్షలు, దామర చెరు వు, కిషన్‌తండా, సుతార్‌పల్లి గ్రామాలకు రూ.45 లక్షలు, ఝాన్సీలింగాపూర్ రూ.30 లక్షలు, కాట్రియల్ రూ. 20లక్ష లు, వెంకటాపూర్‌కు రూ. 20లక్షలు మంజూరయ్యాయి.
చిన్నశంకరంపేట మండలానికి రూ.2.40 కోట్లు
అంబాజీపేట, చందంపేట్, చెన్నాయిపల్లి, గజగట్లపల్లి, జంగారాయి, ఖాజాపూర్ (ఎల్టీ), ఖాజాపూర్, మడూర్, మిర్జాపల్లి, మిర్జాపల్లి (ఎల్టీ), రుద్రారం, ఎస్.కొండాపూర్ (ఎల్టీ), సంగాయిపల్లి, మాందాపూర్(టీ), టీమ్ండాపూర్ (ఎల్టీ), కామారం(ఎల్టీ) గ్రామాలకు రూ.10 లక్షల చొ ప్పున రూ.1.60 కోట్లు, శాలిపేట్ రూ.20 లక్షలు, ధర్పల్లి రూ. 40లక్షలు, భగీరథిపల్లి రూ.20 లక్షలు.
నిజాంపేట మండలానికి రూ. 2.70కోట్లు
బచ్చురాజ్‌పల్లి, నగరం, నందగోకుల్, నందిగామ, రాంపూర్, తిప్పనగుండ్ల, వెంకటాపూర్, జడ్చెరువు తండా మొత్తం 8 గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున రూ.80 లక్ష లు, కల్వకుంట్ల, చల్మెడ, నార్లాపూర్, మూడు గ్రామాలకు రూ.20 లక్షలు చొప్పున రూ.60 లక్షలు నసల్ రూ.60 లక్షలు, నిజాంపేట రూ.70 లక్షలు మంజూరయ్యాయి.
నార్సింగి మండలానికి రూ.30 లక్షలు..
జప్తిశివనూర్కు రూ.10 లక్షలు, సంకాపూర్ రూ.10 లక్షలు, శేరిపల్లికి రూ.10 లక్షలు మంజూరయ్యాయి.
బీఆర్ఎస్తోనే గ్రామాల్లో అభివృద్ధి
నిజాంపేట/ చిన్నశంకరంపేట, జనవరి 10 : బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమని ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు అన్నారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మాట్లాడారు. నిజాంపేట మండలంలోని 13 గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు ప్ర భుత్వం రూ.2.70కోట్లు మంజూరు చేసిందన్నారు. నిజాంపేట, నస్కల్, రాంపూర్, కల్వకుంట, నార్లపూర్ గ్రామాల్లో ముస్లింలకు చెందిన శ్మశాన వాటికల నిర్మాణాలకు రూ.29 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. నిజాంపేట మండలాభివృద్ధికి నిధుల మంజూరుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సు ధాకర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు బాల్‌రెడ్డి, ఎంపీటీసీ లహరి, నేతలు లక్ష్మణ్, రాజ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు ప్రజాప్రతినిధుల కృతజ్ఞతలు
చిన్నశంకరంపేట నుంచి జంగరాయి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.25కోట్లు మంజూరైనట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పదామదేవేందర్రెడ్డి తెలిపారు. జంగరాయి గ్రామస్తులు ఎమ్మెల్యే పద్మదేవేందర్‌రెడ్డి నివాస గృహంలో కలిసి పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో చిన్నశంకరంపేట – జంగరాయి బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 92లక్షలు మం జూరు చేయగా, నిధులు సరిపోకపోవడంతో అదనంగా రూ. 33లక్షలు మంజూరైనట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సహకరించాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామాల్లో ప్రతి వీధిని సీసీరోడ్డుగా మా ర్చాలని సర్పంచ్‌లను ఆదేశించారు. బీటీరోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి జంగరాయి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో బీఆర్ఎస్ మండతిధ్యక్షుడు పట్లోరి రాజు, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, డైరెక్టర్ సిద్దిరెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మీపతి, మాజీ సర్పంచ్ రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బందెళ్ల ప్రభాకర్‌రెడ్డి, సురేశ్ ఉన్నారు.