దుబ్బాక, సెప్టెంబర్ 27: సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎన్నో రకల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మతలతో పాటు అన్ని కులాలకు సమూచిత గౌరవం కల్పించింది. సమైక్యంధ్ర ప్రభుత్వాలు సబ్బండా కులాలను పట్టించుకున్న పాపన పోలేదు. నేడు గ్రామాల్లో నిర్మిస్తున్న కుల సంఘాల భవనాలు సబ్బండ వర్గాలకు ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలుస్తున్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో కమ్యూనిటీ భవనాలకు భారీగా నిధులు మంజూరు కావడంపై ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులు, 8 మండలాల్లో 146 గ్రామ పంచాయతీలున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దుబ్బాక పట్టణంతో పాటు గ్రామాల్లో కుల సంఘాల భవనాల నిర్మాణం జోరందుకున్నాయి. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చొరవతో దుబ్బాకనియోజకవర్గంలో కమ్యూనిటీ భవనాలకు భారీగా నిధులు మంజూరయ్యాయి.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు సహకారంతో దుబ్బాక నియోజకవర్గంలో కుల సంఘాల భవనాలకు ఇటీవల నిధులు మంజూరయ్యాయి. విడతల వారీగా గ్రామాల్లో కుల సంఘాల భవనాలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఇటీవల దుబ్బాక నియోజకవర్గంలో 36 కమ్యూనిటీ భవనాలకు రూ. 1.93కోట్లు నిధులు మంజూరు చేసింది.
దౌల్తాబాద్ మండలంలో ముత్యంపేట ఎస్సీ కమ్యూనిటీ భవనానికి రూ. 5లక్షలు, గాజులపల్లిలో జనరల్ కమ్యూనిటీ భవనానికి రూ. 5లక్షలు, కోనాయిపల్లి జనరల్కమ్యూనిటీ భవనానికి రూ. 5లక్షలు, శేరిపల్లిబందారంలో జనరల్ కమ్యూనిటీ భవనానికి రూ. 5లక్షలు, ముత్యంపేటలో జనరల్ కమ్యూనిటీ భవనానికి రూ. 3లక్షలు, బీసీ కమ్యూనటీ భవానికి రూ. 4లక్షలు, సూరంపల్లి జనరల్ కమ్యూనిటీ భవనానికి రూ. 5లక్షలు, గువ్వలేగి జనరల్ కమ్యూనిటీ భవనానికి రూ. 5లక్షలు, కోనాపూర్ గ్రామ పంచాయతీ భవనానికి రూ. 5లక్ష లు, లింగుపల్లి జనరల్ కమ్యూనిటీ భవనానికి రూ. 5లక్షలు, మల్లేశంపల్లి జనరర్ కమ్యూనిటీ భవనానికి రూ. 5లక్షలు, గోవిందాపూర్ జనరల్ కమ్యూనిటీ భవనానికి రూ. 5లక్షలు నిధులు మంజూరయ్యాయి.
రాయపోల్ మండలంలో రాయపోల్‌లో కల్చరర్ యాక్టివిటీ భవనానికి రూ. 3లక్షలు, జనరల్ కమ్యూనిటీ భవనానికి రూ. 4లక్షలు, తిమ్మక్కపల్లి ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు రూ.5 లక్షలు, చిన్నమాసాన్పల్లిలో బీసీ కమ్యూనిటీ భవానికి రూ. 4లక్షలు, తిమ్మక్కపల్లిలో బీసీ కమ్యూనిటీ భవనానికి రూ. 4లక్షలు, లింగారెడ్డిపల్లిలో బీసీ కమ్యూనటీ భవనానికి రూ. 4లక్షలు, కొత్తపల్లిలో జనరల్ కమ్యూనిటీ భవనానికి రూ. 4లక్షలు నిధులు మంజూరయ్యాయి.
తొగుట మండలంలో జప్తిలింగారెడ్డిపల్లి జనరల్ కమ్యూనటీ భవనానికి రూ. 7లక్షలు, కాన్గల్‌లో జనరల్కమ్యూనటీ భవనానికి రూ. 4లక్షలు, ఘణపూర్‌లో జనరల్ కమ్యూనిటీ భవనానికి రూ. 4లక్షలు, ఎల్లారెడ్డిపేటలో జనరల్ కమ్యూనిటీ భవనానికి రూ.4లక్షలు మంజూరయ్యాయి. మిరుదొడ్డి మండలంలో మోతెలో జనరల్ కమ్యూనిటీ భవనానికి రూ. 4లక్షలు మంజూరు కాగా, చేగుంట, నార్సింగ్ మండలాల్లో 3 కమ్యూనిటీ భవనాలకు రూ. 17లక్షలు మంజూరయ్యాయి.
దుబ్బాక మున్సిపల్లోని లచ్చపేట 10వ వార్డులో కల్చరర్ యాక్టివిటీస్ భవనానికి రూ. 5లక్షలు, జనరల్ కమ్యూనిటీ భవనానికి రూ. 5లక్షలు, చెల్లాపూర్ జనరల్ కమ్యూనిటీ భవనానికి రూ. 5లక్షలు, దుబ్బాక మండలం లో శిలాజీనగర్ ఎస్టీ కమ్యూనిటీ భవనానికి రూ. 5లక్ష లు, ఆకారం బీసీ కమ్యూనిటీ భవనానికి రూ.4లక్షలు, చీ కోడ్ కమ్యూనిటీ హాల్ భవనానికి రూ. 5లక్షలు, రాజక్కపేట బీసీ కమ్యూనిటీ భవనానికి రూ. 4లక్షలు, పరశురామ్నగర్ బీసీ కమ్యూనిటీ భవనానికి రూ. 4లక్షలు, ఆరెపల్లిలో కల్చరర్ యాక్టివిటీస్ భవనానికి రూ. 4లక్షలు, జనరల్ కమ్యూనిటీ భవనానికి రూ.4లక్షలు, తిమ్మాపూర్‌లో మహిళ భవానికి రూ.5లక్షలు, జనరల్ కమ్యూనిటీ భవనానికి రూ.5లక్షలు, పద్మనాభునిపల్లి జనరల్ కమ్యూనిటీ భవనానికి రూ.5లక్షలు, పోతారెడ్డిపేట కమ్యూనిటీ హాల్ కు రూ.4లక్షలు, హబ్సీపూర్ జనరల్ కమ్యూనిటీ భవనానికి రూ. 4లక్షలు నిధులు మంజూరయ్యాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సబ్బండ కులాలకు సముచిత న్యాయం చేకూరింది. గ్రామీణ కుల వృత్తులకు ఆదరణ కల్పించడంతో పాటు సమాజంలో వారు గౌరవప్రదంగా జీవించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. గ్రామాల్లో కమ్యూనిటీహాల్స్తో పాటు కుల సంఘాల భవనాలకు నిధులు కేటాయించడం సంతోషకరం. విడతల వారీగా కుల సంఘాల భవనాలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. దుబ్బాక నియోజకవర్గానికి ఇటీవల 36కమ్యూనిటీ భవనాలకు రూ.1.93కోట్లు మంజూరయ్యాయి.
– మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
కేసీఆర్ సర్కారులోనే గ్రా మీణ కులవృత్తులకు ఆదరణ తో పాటు కుల సంఘాలకు స రైన గౌరవం దక్కింది. దేశం లో ఎక్కడలేని విధంగా మన తెలంగాణలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఆరెపల్లి గ్రామంలో రెండు కుల సంఘాల భవనాలకు రూ. 8లక్షలు మంజూరు చేసినందుకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.