ప్రయాణం..ప్రయాస
అసంపూర్తి రోడ్లతో ప్రజలు, ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో డబుల్ రోడ్డు విస్తరణ పనుల మధ్యలోనే నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రజలను కలిపే ప్రధాన రహదారి కావడంతో ఈ రోడ్డు వెంబడి ప్రతిరోజు వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు విస్తరణ పనులు మధ్యలోనే నిలిపివేయడంతో ప్రజ లు ,ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. సంబంధిత అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- సిద్దిపేట ఎల్లమ్మ ఆలయం నుంచి ఇల్లంతకుంట వరకు ఆగిన నాలుగు వరుసల రోడ్డు విస్తరణ పనులు
- అసంపూర్తి రోడ్డుతో ప్రయాణం నరకం
- నిత్యకృత్యంగా మారిన రోడ్డు ప్రమాదాలు
- కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష
- కన్నెత్తి చూడని సంబంధిత అధికారులు
చిన్నకోడూర్, జూన్ 6 : అసంపూర్తి రోడ్లతో ప్రజలు, ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో డబుల్ రోడ్డు విస్తరణ పనుల మధ్యలోనే నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రజలను కలిపే ప్రధాన రహదారి కావడంతో ఈ రోడ్డు వెంబడి ప్రతిరోజు వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు విస్తరణ పనులు మధ్యలోనే నిలిపివేయడంతో ప్రజ లు ,ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. సంబంధిత అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సిద్దిపేట ఎల్లమ్మ దేవాలయం నుంచి ఇల్లంతకుంట వరకు బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక దృష్టిసారించి సింగిల్ రోడ్డును నాలుగు వరుసల రోడ్డుగా మార్చేందుకు నిధులు మంజూరు చేయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పు డు ఈ రోడ్డు విస్తరణ పనులు వేగంగా సాగా యి. సిద్దిపేటలోని ఎల్లమ్మ ఆలయం నుంచి చిన్నకోడూరు మండలం పెద్దకోడూర్ వరకు రోడ్డు విస్తరణ పనులు బీఆర్ఎస్ హయాంలో వేగంగా జరగగా, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అకడకడ రోడ్డుపైన కంకరతో తేలి గుంతల మయంగా మారింది.
దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోడ్డు వెంబడి సంబంధిత అధికారులు మండల కేంద్రానికి వెళ్తున్నప్పటికీ ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ప్రభుత్వం రావడంతోనే రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయని పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అసంపూర్తి పనులు పూర్తి చేసి ప్రయాణం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రోడ్డు పనులు ఆగడంతో ఇబ్బందులు..
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరిగాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రోడ్డు పనులన్నీ ఎకడికకడే ఆగిపోయినై. రెండున్నర ఏండ్ల నుంచి ఈ రోడ్డు మీదనే రాకపోకలు సాగిస్తున్న. ఎక్కడి పనులు అక్కడనే ఉన్నయి. తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. పెండింగ్ రోడ్డు పనులు తొందరగా చేయాలి.
-వానరాసి కనకయ్య, పెద్దకోడూరు(సిద్దిపేట జిల్లా)
అత్యవసర సమయంలో ప్రయాణం ఇబ్బంది
రోడ్లు మంచిగ ఉంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. గుంతలుగా మారి కంకర తేలి రోడ్డు నరకంగా మారింది. దీంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యవసర సమయాల్లో ఈ రోడ్డుమీద వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నాము. రోజు ఎకడ ఒకచోట ప్రమాదాలు జరుగుతు న్నాయి. అధికా రులు స్పందించి పనులు పూర్తి చేయాలి.
-గాజుల శ్రీహరి, మాచాపూర్ (సిద్దిపేట జిల్లా)
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

