Revenue conferences | రామాయంపేట, జూన్ 17 : రైతుల సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసిందని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. మంగళవారం రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో జరిగే భూ భారతి రెవెన్యూ సదస్సుకు హాజరైన అదనపు కలెక్టర్ రైతులను అటవీ శాఖ భూములు, రెవెన్యు భూములపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రైతులు ఎప్పటికైనా అటవీశాఖ భూముల జోలికి వెళ్లొద్దన్నారు. ఎప్పటికైనా అటవీశాఖ భూముల హక్కులు అటవీశాఖకే ఉంటాయన్నారు. రెవెన్యూకు సంబంధించిన భూములపై ఏదైనా ఎక్కడైనా అవకతవకలు ఉంటే రెవెన్యూ సదస్సులో తమ దరఖాస్తులను అందజేయాలన్నారు. స్థానికంగా సమస్య పరిష్కారం గాకుంటే కలెక్టర్ ఆదేశాల ప్రకారం పరిష్కారం చేస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు.
రెవెన్యు ఫారెస్టు భూముల వివాదాలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సుల ఉద్దేశ్యమన్నారు. భూభారతిలో వచ్చిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ నగేష్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి, ఆర్ఐ.గౌస్ తదితరులు ఉన్నారు.
F-35 fighter jet | ఇంకా కేరళలోనే F-35 ఫైటర్ జెట్.. ఎందుకంటే..!
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Robert Vadra | ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టిన రాబర్ట్ వాద్రా