కొల్చారం, డిసెంబర్ 22 : విద్యారులు తాము కన్న కలలు సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. ఆదివారం కొల్చారంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులు మార్చ్ పాస్ట్‌తో గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని గవర్నర్ స్థానిక ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థినులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సదర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విద్యార్థినులు తనను మార్చ్ పాస్ట్‌తో స్వాగతించినప్పుడు సంతోషించానన్నారు. ఇక్కడి విద్యార్థినులు మౌంటేయిన్ ట్రెక్కింగ్‌లో పాల్గొన్నారని చెప్పడంతో మంరింత అబ్బురపడ్డానన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు బాలికలకు బంగారు భవిషత్తు ఇవ్వాలని కోరుతున్నానన్నారు. తాము కన్న కలలు సాకారమయ్యేందుకు నిరంతరం శ్రమించాలన్నారు. విద్యార్థినిలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. క్రీడల్లో తనకు బాడ్మింటన్ అంటే ఇష్టమని, మాజీ ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శమన్నారు. నిరంతరం చదవడం, రాయడంపైనే ఆసక్తి చూపూతానని తెలిపారు. పుస్తకాలే తనకు నేస్తాలన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ భిన్న సంస్కృతులను మేళవిస్తూ విద్యార్థినులు సాంగించిన నృత్యాలు అలరించాయన్నారు. అనంతరం గవర్నర్ విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, రెసిడెన్సియల్ స్కూల్స్ సెక్రటరీ వర్షిణి, అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొన్నారు.
శివ్వంపేట, డిసెంబర్ 22 : బంగారమ్మ దీవెనలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో బంగారమ్మ రెండో వార్షికోత్సవం సందర్భంగా భక్తులు అమ్మవారి కల్యాణం, బోనాలు, ఒడిబియ్యం సమర్పించారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యే హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యుడు మన్సూర్, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ గోవింద్‌నాయక్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌గౌడ్, మాజీ సర్పంచ్ అనూష అశోక్‌గౌడ్, మాజీ ఉపసర్పంచ్ సంధ్య వెంకటస్వామి, నాయకులు శ్రీశైలంయాదవ్, బాబురావు, సత్యంగౌడ్, గునంగారి రాజు ఉన్నారు.
కౌడిపల్లి, డిసెంబర్ 22: ఎల్వోసీతో బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వడ్ల మహేశ్‌కు మంజూరైన రూ.లక్ష ఎల్వోసీ చెక్కును లబ్ధిదారులకు ఆదివారం అందజేశారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు కిశోర్‌గౌడ్, గుంజరి ప్రవీణ్, ప్రతాప్‌గౌడ్, రవిసాగర్ ఉన్నారు.