సిద్దిపేట జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు నీళ్లు అందించాలని, అందుకు అవసరమైన నీటిని మిడ్‌మానేరు నుంచి రంగనాయకసాగర్‌కు పంపింగ్ చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు లేఖ రాశారు. ఈ మేరకు శనివారం శాసనసభలో మంత్రిని కలిసి ఆయన లేఖ అందజేశారు. సిద్దిపేటలో లేఖ సారాంశాన్ని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదివారం మీడియాకు విడుదల చేశారు. మూడేండ్లుగా జిల్లాలో సాగు భూములకు రంగనాయకసాగర్ ద్వారా నీరు అందజేశామన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో యాసంగి పంటకు సరిపడా నీరు రిజర్వాయర్‌లో లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారని లేఖలో హరీశ్‌రావు పేరొన్నారు. అధికారులకు ఆదేశించి తక్షణం నీటిని విడుదల చేయాలని లేఖలో హరీశ్‌రావు కోరారు.
సిద్దిపేట, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు నీళ్లు అందించాలని, అందుకు అవసరమైన నీటిని మిడ్‌మానేర్ నుంచి రంగనాయకసాగర్‌కు పంపింగ్ చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ రాశారు. శనివారం శాసనసభలో మంత్రిని కలిసి లేఖను అందజేశారు. ఆదివారం సిద్దిపేటలో లేఖ సారాంశాన్ని మీడియాకు విడుదల చేశారు. నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లా రైతాంగ ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నట్లు చెప్పారు. మూడేండ్లుగా జిల్లాలో సాగు భూములకు రంగనాయకసాగర్ ద్వారా సాగునీరు అందజేసినట్లు తెలిపారు. ఈ యేడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో యాసంగి పంటకు సరిపోయే నీరు రిజర్వాయర్‌లో లేక రైతాంగం ఆందోళనకు గురవుతున్నట్లు లేఖలో పేరొన్నట్లు వివరించారు. యాసంగికి నీళ్లు అందించాలంటే మూడు టీఎంసీల నీరు ఉండాలి. కానీ, ప్రస్తుతం రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లో 1.50 టీఎంసీ మాత్రమే ఉంది. రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వెంటనే మిడ్‌మానేరు నుంచి 1.50 టీఎంసీల నీళ్లు రంగనాయకసాగర్‌కు వచ్చేలా పంపింగ్ చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించాలని లేఖ ద్వారా మనవి చేశారు. జిల్లాలో యాసంగి సాగు పనులు జోరందుకున్నాయని, యేటా మాదిరిగానే ఈసారి సాగు నీరు వస్తాయని రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. మూడేండ్లుగా సాగునీటిని అందించిన విధంగానే ఈసారి కూడా యాసంగి పంటకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.