మల్లాపూర్, ఫిబ్రవరి 7: మహా శివరాత్రి వేడుకలను పునస్కరించుకొని మండల కేంద్రంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ కనక సోమేశ్వర స్వామి జాతర ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. సోమేశ్వరస్వామి కొండ వద్ద దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, కమిటీ సభ్యులు, శివ దీక్షపరులు సమిష్టిగా కలిసి విడుదల చేశారు. జాతర ఉత్సవాలు ఫిబ్రవరి13 నుంది 17వతే దీ వరకు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
ఐదు రోజులపాటు నిర్వహించే ఉత్సవాల్లోని ప్రధాన కార్యక్రమాల వివరాలివి. ఫిబ్రవరి13న మంటప స్థాపన, పుణ్యవచనం, అఖండ దీపారాధన జరుపుతారు. ఫిబ్రవరి14న నవగ్రహ, సుబ్రమణ్య హోమం, శివదీక్షపరుల జ్యోతిర్ముడి, గిరి ప్రదక్షణ ఉంటాయి. ఫిబ్రవరి15న రుద్రాభిషేకం, రుద్రహోమం, తెప్పోత్సవం, నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 16న స్వామి కల్యాణం, జాతర, అన్నపూజ, సోమేశ్వరస్వామి రథోత్సవం.. ఫిబ్రవరి17న ఉర్సు ఉత్సవాలు జరుపుతున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు సంగ గంగరాజం యాదవ్ తెలిపారు. ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణలో సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఆలయ ప్రధాన ఆర్చకులు బల్యపల్లి ప్రభాకర్ శర్మ, ఉప సర్పంచ్ గడ్డం సోమారెడ్డి, కమిటీ వైస్ చైర్మన్ ఇల్లెందుల తుకారం, కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, శివదీక్షాపరులు, అఖిలపక్ష పార్టీల నాయకులు, భక్తులు పాల్గొన్నారు.