పటాన్చెరు, సెప్టెంబర్ 27: ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలంలోని చిట్కుల్ గ్రామంలో రూ.3.56 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. మండల పరిషత్, జడ్పీ ప్రాథమిక పాఠశాలలో మనఊరు- మనబడిలో చేపట్టిన వివిధ పనులు, చిట్కుల్ గ్రామం నుంచి లక్డారం గ్రామాలను అనుసంధానిస్తూ నిర్మించిన బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. మొత్తం 3.06 కోట్లతో చేపట్టిన పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత నీళ్లు, వైద్యంతోపాటు విద్యారంగానికి ప్రథ మ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. దేశంలోనే మొ దటిసారిగా ప్రతి పాఠశాలలో తెలుగుతో పాటు ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు.
‘మన ఊరు- మనబడి’ ద్వారా ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడంతో ఇప్పుడు సర్కారు బడుల అడ్మిషన్లు పెరిగాయన్నా రు. చిట్కుల్ గ్రామం అభివృద్ధికి తాను భారీగా నిధులు అందజేస్తున్నానని తెలిపారు. గ్రామాభివృద్ధికి పాటుపడుతానని హామీనిచ్చారు. కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీలకు సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేశామన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలని ఎమ్మెల్యే సూచించారు.
ముదిరాజ్ సంఘం వినాయక మండపంలో ఎమ్మెల్యే పూజలు చేశారు. ముదిరాజ్ సంఘం నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, ఎంపీటీసీలు మంజుల శ్రీశైలంయాదవ్, మాధవి నరేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంఈవో పీపీ రాథోడ్, సీనియర్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి, కార్యదర్శి కవిత, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.