Current Shock | చేగుంట, జూలై 15 : విద్యుత్ ఘాతంతో తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న రికార్డు అసిస్టెంట్ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.
కుటుంబ సభ్యులు, చేగుంట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహీంపూర్లో గ్రామానికి చెందిన మరిపల్లి శ్రీనివాస్(35)తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తాడు. తన వ్యవసాయ పొలం వద్ద వరి నాటు వేసే క్రమంలో బోరు మోటార్ నడవకపోవడంతో మరమ్మత్తు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్ తగిలి శ్రీనివాస్ అక్కడిక్కడే మృతి చెందాడు.
మృతుడికి భార్య రమ్య, కుమారులు దీక్షిత్, భారత్‌లు ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు.
Maddur | వర్షాల కోసం బతుకమ్మ ఆడిన మహిళలు
Bonalu | గుమ్మడిదలలో ఘనంగా ఎల్లమ్మతల్లి బోనాలు
Congress leader | మెదక్ జిల్లాలో కాంగ్రెస్ యువ నాయకుడు అనుమానాస్పద మృతి