ఓటింగ్‌పై అవగాహన ఉండాలి
పటిష్టమైన ప్రజాస్వామ్య పాలన నిర్వహించేందుకు, సమర్థవంతమైన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడం ఓటు ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని మెదక్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఈవీఎం డిమోన్షేషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్వో పద్మశ్రీతో కలిసి ఆయన ప్రారంభించారు.
- మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మెదక్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : పటిష్టమైన ప్రజాస్వామ్య పాలన నిర్వహించేందుకు, సమర్థవంతమైన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడం ఓటు ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని మెదక్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఈవీఎం డిమోన్షేషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్వో పద్మశ్రీతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరుకు ఓటు హకును వినియోగించుకునే సౌకర్యాలు కల్పించడమే కాకుండా ఓటింగ్ యం త్రాలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తూ, వారిని రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం సిద్ధం చేసేలా ఈవీఎం, వీవీపాట్, కంట్రోల్ యూనిట్లతో కూడిన డిమోన్షేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మెదక్, నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టరేట్ ఆఫీస్ కాంప్లెక్స్‌లో మొత్తం మూడు డిమోన్షేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నిరక్షరాస్యులు, వృద్ధులు, నూతన ఓటర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈవీఎం డిమోన్షేషన్ కేంద్రాలకు వెళ్లి ఓటింగ్ యంత్రాలను పరిశీలించి ఓటు వేసే విధానాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా ఓటరు ఓటు హకును వినియోగించుకునే యంత్రాల గురించి సంపూర్ణ స్పష్టత, అవగాహన లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎన్నికల సూపరింటెండెంట్ హర్దీప్ సింగ్, ఎలక్షన్స్ డీటీలు, ఇతర ఎలక్షన్ సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

